logo

స్మార్ట్‌సిటీ పనుల్లో అపశ్రుతి

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న వరదకాల్వ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. కట్టరాంపూర్‌ నుంచి తిరుమల్‌నగర్‌ వైపు మూడు రోజులుగా వరద కాల్వ పనుల కోసం ఒకవైపు తవ్వుతూ.. మరోవైపు సాలకతో కాంక్రీట్‌ పనులు చేస్తున్నారు.

Published : 02 Feb 2023 06:09 IST

గోడ కూలి ఒకరు మృతి

గంగారం మోతే

కరీంనగర్‌ నేరవార్తలు, కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న వరదకాల్వ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. కట్టరాంపూర్‌ నుంచి తిరుమల్‌నగర్‌ వైపు మూడు రోజులుగా వరద కాల్వ పనుల కోసం ఒకవైపు తవ్వుతూ.. మరోవైపు సాలకతో కాంక్రీట్‌ పనులు చేస్తున్నారు. అదే తరహాలో తిరుమల్‌నగర్‌ రోడ్డు నంబర్‌ 6లో బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పనులు చేస్తుండగా ఓ ఇంటికి సంబంధించిన ఇటుక గోడ ఆకస్మికంగా కూలి కాల్వలో పని చేస్తున్న కార్మికులపై పడింది. ముగ్గురు కార్మికుల్లో ఇద్దరికీ స్వల్ప గాయాలు కాగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో సదరు ఏజెన్సీ నిర్వహకులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరంతా బీహార్‌కు చెందిన కార్మికులని తెలిసింది. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బీహర్‌ రాష్ట్రంలోని బేర్మాకు చెందిన గంగారాం మోతే (32) అనే కార్మికుడు రాత్రి మృతి చెందారు. మృతుడు నెల రోజుల కిందటే కరీంనగర్‌కు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో ఠాణా సీఐ నటేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని