logo

మహిళల రక్షణపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి

మహిళల రక్షణకు పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ పేర్కొన్నారు. పెద్దపల్లిలో శనివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థినులకు మహిళల భద్రత, షీ టీంల సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

Published : 05 Feb 2023 04:59 IST

పెద్దపల్లి, న్యూస్‌టుడే: మహిళల రక్షణకు పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ పేర్కొన్నారు. పెద్దపల్లిలో శనివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థినులకు మహిళల భద్రత, షీ టీంల సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల వినియోగం పెరగడంతో విద్యార్థినులకు వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. కళాశాలలలో ఈవ్‌టీజింగ్‌, ర్యాగింగ్‌ సంస్కృతి పోలేదని, ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు అనేక చట్టాలు అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులు చదువుపై మాత్రమే దృష్టి పెట్టాలని, ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వొద్దన్నారు. సైబర్‌ మోసాలపై 1930 టోల్‌ ఫ్రీ నెంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతకుముందు ఏసీపీ ఎడ్ల మహేష్‌ మాట్లాడారు. కార్యక్రమంలో సీఐలు ప్రదీప్‌కుమార్‌, అనిల్‌కుమార్‌, ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రాజేశ్‌, గాయత్రి కళాశాల కరస్పాండెంట్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని