logo

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు.

Published : 21 Mar 2023 06:16 IST

లక్ష్మీపూర్‌లో మామిడి తోటను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రవిశంకర్‌

చొప్పదండి, రామడుగు, న్యూస్‌టుడే: అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. సోమవారం చొప్పదండి మండలం మంగళపల్లితో పాటు రామడుగు మండలం లక్ష్మీపూర్‌, వెంకట్రావుపల్లి, దత్తోజిపేట గ్రామాల్లో క్షేత్రాలను సందర్శించారు. సత్వరం సర్వే నివేదికను ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. డీఏవో శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.

మూడోరోజూ వడగళ్లు  

గంగాధర: మండలంలోని ర్యాలపల్లి, చర్లపల్లి ఆర్‌, కుర్మపల్లి గ్రామాల్లో సోమవారం సాయంత్రం వడగళ్ల వాన పడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంటలకు నష్టం వాటిల్లిందని, మూడో రోజు సైతం వాన రావడంతో కుదేలయ్యామని స్థానిక రైతులు వాపోయారు.  

పంటల పరిశీలన

చొప్పదండి: మండలంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను భాజపా నాయకులు, ఎంపీటీసీ సభ్యులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, తోట కోటేశ్‌ పరిశీలించారు. పంటల నష్టాలను అంచనా వేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఎకరాకు రూ. 50 వేల పరిహారం చెల్లించాలన్నారు. సుదర్శన్‌రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని