logo

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం అడ్డగింత

కోరుట్ల పట్టణంలోని గడి బురుజు ప్రాంతంలో అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు బుధవారం ఉదయం వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందంను ఇంటి యజమానులు, నాయకులు అడ్డుకున్నారు.

Published : 30 Mar 2023 06:26 IST

ఇంటి నిర్మాణదారుతో మాట్లాడుతున్న ఆర్డీవో వినోద్‌కుమార్‌

కోరుట్ల, న్యూస్‌టుడే: కోరుట్ల పట్టణంలోని గడి బురుజు ప్రాంతంలో అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు బుధవారం ఉదయం వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందంను ఇంటి యజమానులు, నాయకులు అడ్డుకున్నారు. రెండు అక్రమ ఇంటి నిర్మాణాలను తొలగించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం లీడర్‌, ఆర్డీవో వినోద్‌కుమార్‌ ఇతర సిబ్బంది వెళ్లారు. గడి బురుజు ప్రాంతంలో ఇంటి నిర్మాణాలకు మున్సిపల్‌ అనుమతులు ఇవ్వడం లేదని యజమానులు వాపోయారు. టీఎస్‌బీపాస్‌ నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టడంతో వాటిని తొలగిస్తామని తెలుపగా యజమానులు, నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్రమ భవన నిర్మాణం ప్రారంభంలోనే మున్సిపల్‌ అధికారులు అడ్డుచెప్పితే పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరగవని ఆర్డీవో అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ గడ్డమీది పవన్‌ సంఘటన స్థలానికి చేరుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీంతో మాట్లాడారు. వారం రోజుల్లోగా అక్రమ నిర్మాణాలను తొలగించుకుంటామని యజమానులు రాతపూర్వకంగా ఇవ్వడంతో రెండు ఇళ్లను సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఆర్‌అండ్‌బీ ఏఈ రాజు, టీపీఎస్‌ రమ్య, పోలీస్‌, ఫైర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని