logo

బాలికలదే పై చేయి

జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు.

Published : 25 Apr 2024 04:20 IST

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లాకు 31వ స్థానం

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. విద్యార్థుల గైర్హాజరు కూడా ఫలితాలు తగ్గడానికి కారణమవుతోంది. రాష్ట్రంలో ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 31వ స్థానంలో నిలిచింది.

ఉత్తీర్ణతలో తడబాటు

జిల్లాలో 14 ప్రభుత్వ కళాశాలలు, 7 ఆదర్శ, 6 సాంఘిక సంక్షేమ, 6 కస్తూర్బా, 1 గిరిజన గురుకులం, 4 మైనార్టీ, 5 జ్యోతిబాఫులే కళాశాలల్లో జనరల్‌ కేటగిరీ ప్రథమ సంవత్సరంలో 4,120 మందికి 1,908 ఉత్తీర్ణత సాధించగా 46.31 శాతం, ద్వితీయ ఏడాదిలో 4,007 మందికి 2,377 ఉత్తీర్ణత సాధించగా 59.32 శాతం నమోదైంది. వృత్తివిద్య కేటగిరిలో 1,092 మందికి 556 ఉత్తీర్ణతతో 50.92 శాతం, ద్వితీయంలో 439 మందికి 277 ఉత్తీర్ణత సాధించగా 63.1 శాతం నమోదైంది.

  • జిల్లాలో 6 కస్తూర్బా పాఠశాలల్లో ప్రథమంలో 297 మందికి 289 మంది ఉత్తీర్ణత పొందగా 86 శాతం, ద్వితీయంలో 299 మంది విద్యార్థులకు 191 మంది ఉత్తీర్ణత సాధించగా 63 శాతం ఉంది. జిల్లాలోని 6 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రథమ సంవత్సరంలో 80.2 శాతం, ద్వితీయంలో 79.4 శాతం ఉత్తీర్ణత పొందారు. జిల్లాలో గోదావరిఖని కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న మునుజ్జ 493 (హెచ్‌ఈసీ), కమాన్‌పూర్‌ జూనియర్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థిని శ్రీనిధి 985(బైపీసీ) మార్కులతో సత్తా చాటారు.

ప్రైవేటుకు దీటుగా మెరుగైన ఫలితాలు

జిల్లాలో ప్రైవేటు కళాశాలలతో పోల్చితే ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. ప్రథమ సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలల్లో 48.95 శాతం, ప్రైవేటులో 34.36 శాతం, ద్వితీయంలో 60.6 శాతం, ప్రైవేటులో 44.6 శాతం ఉత్తీర్ణత సాధించారు.

కల్పన, జిల్లా నోడల్‌ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు