logo

స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు

తంగళ్లపల్లి మండలం టెక్స్‌టైల్‌ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్‌ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది.

Updated : 19 Apr 2024 05:57 IST

టెక్స్‌టైల్‌ పార్కు వద్ద కేటాయించిన స్థలం

తంగళ్లపల్లి, న్యూస్‌టుడే: తంగళ్లపల్లి మండలం టెక్స్‌టైల్‌ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్‌ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. స్థలం చుట్టూ ప్రహరీ సైతం నిర్మించారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి ప్రస్తుతం తాత్కాలికంగా వేములవాడ మండలంలో కొనసాగుతుంది. అప్పుడు పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఆసుపత్రి అక్కడే కొనసాగుతుంది. ఆసుపత్రి నిర్మాణం కోసం పదేళ్ల క్రితం రూ.3 కోట్లు మంజూరయ్యాయి. భారాస ప్రభుత్వం వచ్చాక దీనిని పట్టించుకోలేదు. మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. పొన్నం ప్రభాకర్‌ ప్రస్తుతం బీసీ సంక్షేమశాఖ, రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడైనా ఆసుపత్రి నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, బీడీ కార్మికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని