logo

సుత్తూరు జాతర రద్దు

కరోనా ఆంక్షల నేపథ్యంలో సుత్తూరు జాతరను రద్దు చేసినట్లు మఠం వర్గాలు తెలిపాయి. సంప్రదాయం ప్రకారం ఈనెల 29, 30 తేదీల్లో ఉత్సవాల్ని నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో భక్తులు పాల్గొనేందుకు వీలుండదు. కార్యక్రమాల్ని యూట్యూబ్‌లో ప్రసారం చేయనున్నందున

Published : 18 Jan 2022 01:32 IST

 సంప్రదాయంగా ఉత్సవాలు


సుత్తూరు జాతర (పాతచిత్రం)

మైసూరు, న్యూస్‌టుడే : కరోనా ఆంక్షల నేపథ్యంలో సుత్తూరు జాతరను రద్దు చేసినట్లు మఠం వర్గాలు తెలిపాయి. సంప్రదాయం ప్రకారం ఈనెల 29, 30 తేదీల్లో ఉత్సవాల్ని నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో భక్తులు పాల్గొనేందుకు వీలుండదు. కార్యక్రమాల్ని యూట్యూబ్‌లో ప్రసారం చేయనున్నందున భక్తులు ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చని మఠం ప్రముఖులు తెలిపారు. రథోత్సవం, తెప్పోత్సవం, వ్యవసాయ మేళా, కుస్తీ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల పోటీలు ఉండవని స్పష్టం చేశారు. ముందు నిర్ణయించిన ప్రకారం ఈనెల 28 నుంచి వచ్చేనెల రెండు వరకు ఉత్సవాలు కొనసాగాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్సవాల్ని నిర్వహించడం వల్ల అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నందున కరోనా మరింతగా ప్రబలే ప్రమాదం ఉన్నందున రద్దు చేసినట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని