logo

హెచ్చెల్సీ కింద జోరుగా పంటల సాగు

తుంగభద్ర జలాశయం చరిత్రలో రెండోసారి హెచ్చెల్సీ కాలువకు మార్చి వరకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు టి.బి.బోర్డు అధికారులు రైతులకు భరోసా ఇవ్వడంతో ఆయకట్టు కింద 70 నుంచి 80 రోజుల్లో వచ్చే పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు.

Published : 21 Jan 2022 06:31 IST


ఏపుగా పెరిగిన జొన్న పంట

బళ్లారి, న్యూస్‌టుడే: తుంగభద్ర జలాశయం చరిత్రలో రెండోసారి హెచ్చెల్సీ కాలువకు మార్చి వరకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు టి.బి.బోర్డు అధికారులు రైతులకు భరోసా ఇవ్వడంతో ఆయకట్టు కింద 70 నుంచి 80 రోజుల్లో వచ్చే పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఎల్లెల్సీ కింద రైతులు వరి నాటగా, హెచ్చెల్సీ కాలువలకు జనవరి 11న నీటిని విడుదల చేయడంతో జొన్న, మొక్కజొన్న, సజ్జ, కొర్ర, పెసర, అలసంద తదితర పంటలు సాగు చేశారు.  జనవరి 11 నాటికి 90 టి.ఎం.సి.ల నీరు జలాశయంలో నిల్వ ఉండటంతో, హెచ్చెల్సీకి మార్చి 15 వరకు నీటిని విడుదల చేస్తే స్వల్పకాలిక పంటలు సాగు చేస్తామని రైతులు ఒత్తిడి తేవడంతో ఫిబ్రవరి 28 వరకు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. జలాశయంలో నీటి లభ్యతను బట్టి మార్చి 15 వరకు విడుదల చేస్తామని షరతు పెట్టడంతో హెచ్చెల్సీ పరిధిలో పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు. 
స్వల్పకాలిక పంటలకు అనుకూలం
రైతులు 70 నుంచి 80 రోజుల్లో దిగుబడి వచ్చే జొన్న, మొక్కజొన్న, కొర్రలు, సజ్జ, మరికొంత మంది రైతులు ఉల్లి, పెసర, అలసంద తదితర పంటలను వేశారు. కొందరు అంతర పంటలను సాగు చేశారు. ఇప్పటికే మొలకెత్తిన పంటలు దాదాపు అడుగు ఎత్తులో ఉన్నాయి. మార్చి 15 వరకు కాలువకు నీటిని విడుదల చేస్తే పంటలు ఆశాజనకంగా ఉంటాయని రైతులు శ్రీనివాసులు, యర్రికాంత్‌ రెడ్డి తెలిపారు. ఖరీఫ్‌లో పంటలు కోల్పోవడంతో రబీలో అయినా కలిసొస్తుందని  ఆశగా చెప్పారు. ప్రస్తుతం జొన్న, మొక్కజొన్న, కొర్ర పంటలకు అనుకూలమని కృష్ణానగర్‌ క్యాంపునకు చెందిన రైతు శ్రీనివాసరావు తెలిపారు. 


మిరపలో అంతరపంటగా కొర్ర సాగు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని