logo

బరిలో దిగే వీరులెవరో?

విధానసభ నుంచి విధాన పరిషత్తుకు నిర్వహించనున్న ఏడు నియోజకవర్గాలకు మూడు పార్టీల అభ్యర్థులను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. నామపత్రాలను దాఖలు చేసేందుకు మంగళవారం చివరి రోజు. మే 17 నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు

Published : 23 May 2022 01:38 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : విధానసభ నుంచి విధాన పరిషత్తుకు నిర్వహించనున్న ఏడు నియోజకవర్గాలకు మూడు పార్టీల అభ్యర్థులను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. నామపత్రాలను దాఖలు చేసేందుకు మంగళవారం చివరి రోజు. మే 17 నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉండగా ఇప్పటి వరకు మూడు పార్టీలూ అభ్యర్థులను ఖరారు చేయనే లేదు. జనతాదళ్‌ టిక్కెట్టు దక్కించుకునేందుకు టి.ఎ.శరవణ, వీరేంద్ర పోటీ పడుతున్నారు. అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యత దళపతి దేవేగౌడకు అప్పగించారు. మధ్యకర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయాలని భావిస్తే వీరేంద్రకు అవకాశం దక్కుతుంది. మరోవైపు కమలదళం అభ్యర్థుల ఎంపిక నిర్ణయాన్ని భాజపా కేంద్ర సమితి తీర్మానించనుంది. భాజపా, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇప్పటికే కొందరు అభ్యర్థుల పేర్లను ఎంపిక చేసి, ఆమోదం కోసం తమ పార్టీల హైకమాండ్‌ నేతలకు పంపించారు. సోమవారం సాయంత్రంలోగా అభ్యర్థులను ప్రకటిస్తారని జాతీయ పార్టీల రాష్ట్ర నాయకులు వేచి చూస్తున్నారు. విధానసభలో సభ్యుల సంఖ్యకు అనుగుణంగా భాజపా నాలుగు, కాంగ్రెస్‌ రెండు, దళ్‌ ఒక స్థానాన్ని సులభంగా గెల్చుకునేందుకు అవకాశం ఉంటుంది. జాతీయ పార్టీలు అదనంగా తలా ఒక అభ్యర్థిని బరిలో దించితే ఓటింగ్‌ అనివార్యమవుతుంది. ఎమ్మెల్సీలు లక్ష్మణ సవది, ఆర్‌.బి.తిమ్మాపుర, అల్లవీరభద్రప్ప, హెచ్‌.ఎం.రమేశ్‌ గౌడ, వీణా అచ్చయ్య, కె.వి.నారాయణ స్వామి, లెహర్‌సింగ్‌ల పదవీ కాలం జూన్‌ 14కు ముగియనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని