logo

సంక్షేమానికి భారీగా నిధుల కేటాయింపు

ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై 2022-23 రాష్ట్ర పద్దులలో షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధి- సంక్షేమానికి రూ.28,234 కోట్లు కేటాయించి ప్రగతి పనులు ఊపందుకునేలా చేశారని భాజపా ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తిప్పరాజ హవల్దార్‌ వెల్లడించారు.

Published : 24 May 2022 02:28 IST

విలేకరులతో మాట్లాడుతున్న తిప్పరాజ హవల్దార్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై 2022-23 రాష్ట్ర పద్దులలో షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధి- సంక్షేమానికి రూ.28,234 కోట్లు కేటాయించి ప్రగతి పనులు ఊపందుకునేలా చేశారని భాజపా ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తిప్పరాజ హవల్దార్‌ వెల్లడించారు. ఇందులో ఎస్సీలకు రూ.20,112 కోట్లు, ఎస్టీలకు 8,121 కోట్లు సమకూరాయని వివరించారు. ఈ సముదాయాలకు చెందిన వారికి 75 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇస్తున్నామని ఇంధన మంత్రి సునీల్‌ కుమార్‌ ప్రకటించడాన్ని ఆయన గుర్తుచేశారు. బెంగళూరులో పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో మోర్చా ప్రతినిధులు నరసింహ నాయక, మహంతేశ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం వెనుకబడిన వర్గాలు, దళితుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. చిత్రదుర్గ కోట నుంచి సురపుర వరకు రాజా మదకరి నాయక ర్యాలీ, ఆదివాసీల మేళాను నవంబరులో నిర్వహిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని