logo

ఎస్సై ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు..

కర్ణాటక పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాల దర్యాప్తు అనూహ్య మలుపు తిరిగింది. రాష్ట్ర అదనపు పోలీసు ప్రధానాధికారి అమృత్‌పౌల్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు డీఎస్పీ స్థాయి అధికారుల వరకు మాత్రమే అరెస్టులకు పరిమితం కాగా..

Published : 05 Jul 2022 02:59 IST
కర్ణాటక ఏడీజీపీ అమృత్‌పౌల్‌ అరెస్టు
సీఐడీ దర్యాప్తులో అనూహ్య మలుపు

కలబురగి, న్యూస్‌టుడే : కర్ణాటక పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాల దర్యాప్తు అనూహ్య మలుపు తిరిగింది. రాష్ట్ర అదనపు పోలీసు ప్రధానాధికారి అమృత్‌పౌల్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు డీఎస్పీ స్థాయి అధికారుల వరకు మాత్రమే అరెస్టులకు పరిమితం కాగా.. సోమవారం ఏడీజీపీ స్థాయి అధికారిని అరెస్టు చేయడంతో ఒక్కసారిగా అక్రమార్కులకు దడపుట్టింది. నియామక విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేనసిన అమృత్‌పౌల్‌ ఏకంగా 25 మంది అభ్యర్థుల నియామకాలకు సంబంధించి ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 లక్షలకు పైగా లంచాన్ని తీసుకుని ఇతరులకు కూడా పంచిపెట్టారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశారు. అమృత్‌పౌల్‌ను గతంలో కూడా రెండుసార్లు దర్యాప్తునకు రావాలని తాఖీదులిచ్చినా.. వివిధ కారణాల్ని నెపంగా చెప్పి తప్పించుకున్నట్లు తెలిసింది. కింది స్థాయి అధికారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఆయనను అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని