logo

రాజధానిలో హిజాబ్‌ సెగ

మంగళూరు నుంచి హిజాబ్‌ వివాదం బెంగళూరులో అడుగు పెట్టింది. ఫ్రేజర్‌టౌన్‌ పరిధి సెయింట్‌ జాన్స్‌ చర్చి వీధిలోని ప్రముఖ విద్యాలయం.. నెహ్రూ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలకు శనివారం కొందరు విద్యార్థినులు హిజాబ్‌ ధరించి వచ్చారు.

Published : 25 Sep 2022 03:12 IST

హిజాబ్‌తో వచ్చిన విద్యార్థినులతో మాట్లాడుతున్న అధికారులు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : మంగళూరు నుంచి హిజాబ్‌ వివాదం బెంగళూరులో అడుగు పెట్టింది. ఫ్రేజర్‌టౌన్‌ పరిధి సెయింట్‌ జాన్స్‌ చర్చి వీధిలోని ప్రముఖ విద్యాలయం.. నెహ్రూ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలకు శనివారం కొందరు విద్యార్థినులు హిజాబ్‌ ధరించి వచ్చారు. తరగతులకు హాజరు కాకుండా పాఠశాల యాజమాన్యం వారిని అడ్డుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థినుల కుటుంబ సభ్యులతో పాటు శివాజీనగర ఎమ్మెల్యే రిజ్వాన్‌ అర్షద్‌ అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాఠశాల వరకు హిజాబ్‌తో రావచ్చని, తరగతి గదుల్లో హిజాబ్‌లను అనుమతించబోమని పాఠశాల యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. దీంతో ఎక్కువ మంది విద్యార్థినులు ఇళ్లకు తిరిగి వెళ్లారు. అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పాఠశాల వద్ద పోలీసులు భద్రత కల్పించారు.

పాఠశాల ముంగిట ఎవరూ గుమికూడకుండా భద్రత కట్టుదిట్టం​​​​​​​

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని