logo

జీవన సార్థకత

గదగ సమీపంలోని సూరణగి గ్రామానికి చెందిన ద్యామణ్ణ దేవేంద్రప్ప నీరలగి, జ్యోతి దంపతులకు వివాహమైన ఎనిమిదేళ్లకు ఒక మగబిడ్డ జన్మించాడు. అతనికి జీవన్‌ అనే పేరు పెట్టి, అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. జీవన్‌కు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు 2019 డిసెంబరు 21న మెదడువాపు వ్యాధితో మరణించాడు.

Published : 04 Oct 2022 02:18 IST

ఇంటి పత్రాలు అందిస్తున్న దేవేంద్రప్ప

గదగ, న్యూస్‌టుడే : గదగ సమీపంలోని సూరణగి గ్రామానికి చెందిన ద్యామణ్ణ దేవేంద్రప్ప నీరలగి, జ్యోతి దంపతులకు వివాహమైన ఎనిమిదేళ్లకు ఒక మగబిడ్డ జన్మించాడు. అతనికి జీవన్‌ అనే పేరు పెట్టి, అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. జీవన్‌కు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు 2019 డిసెంబరు 21న మెదడువాపు వ్యాధితో మరణించాడు. కొడుకు పేరు శాశ్వతంగా ఉండాలని తమ గ్రామంలో జీవన్‌ పేరిట ఓ లేఅవుట్ను రూపొందించారు. అందులో 40 ఇంటి స్థలాలను సిద్ధం చేశారు. గ్రామంలో దివ్యాంగులు, వితంతువులు, నిర్వాసితులకు ఆ స్థలాలను వివరణ చేసే ప్రయత్నాలను ప్రారంభించారు. కుమారుడి వైద్య చికిత్సకు తనకున్న ఎనిమిది ఎకరాల పొలంలో మూడెకరాలు విక్రయించారు. ఇప్పుడు తనకు ఉన్న పొలంలో  ఎకరంలో లేఅవుట్ రూపొందించాడు. ఒక్కో లబ్ధిదారునికి 540 చ.అడుగుల విస్తీర్ణంలో స్థలాన్ని ఇవ్వనున్నారు. ఇప్పటికే కొందరికి స్థలాలను పంపిణీ చేశారు. మరో బిడ్డను దత్తత తీసుకోవడం కన్నా.. ఇంటి స్థలాలను దానం చేయడమే ఉత్తమమని భావించి తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ద్యామణ్ణ దేవేంద్రప్ప నీరలగి, జ్యోతి దంపతులు తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని