logo

వైభవంగా మహారథోత్సవం

వేలసంఖ్యలో భక్తులు, సకల వాయిద్యాలతో సింధనూరు తాలూకా వళబళ్లారిలో శనివారం సాయంత్రం అమృత మహోత్సవ రథోత్సవం వైభవంగా సాగింది. భక్తులు జయజయనాధాలు మోగిస్తూ..

Published : 29 Jan 2023 04:02 IST

సింధనూరు వళబళ్లారిలో ఘనంగా సాగుతున్న మహారథోత్సవం

సింధనూరు, న్యూస్‌టుడే: వేలసంఖ్యలో భక్తులు, సకల వాయిద్యాలతో సింధనూరు తాలూకా వళబళ్లారిలో శనివారం సాయంత్రం అమృత మహోత్సవ రథోత్సవం వైభవంగా సాగింది. భక్తులు జయజయనాధాలు మోగిస్తూ.. భక్తితో అరటిపళ్లను సమర్చించి మొక్కులు తీర్చుకున్నారు. వళబళ్లారి మఠం అమృత మహోత్సవాల చివరిరోజు కూడా శనివారం కావడంతో భక్తజనం కిక్కిరిసిపోయారు. మఠంలో అయ్యాచార దీక్షలతో కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. ప్రధాన వేదికపై ఈ ప్రాంతం వ్యవసాయరంగంపై గోష్ఠి కార్యక్రమాలు జరిగాయి. చివరిరోజు సాయంత్రం మహారథోత్సవం అనంతరం ప్రధాన ఘట్టం వళబళ్లారి సిద్ధలింగమహాస్వామి తులాభార సేవ వీక్షించేందుకు జనం అధికసంఖ్యలో తరలివచ్చారు. సిద్ధలింగమహాస్వామి భక్తులకు ఆశీర్వచనం అందించారు.


తరలివచ్చిన భక్తజనం


హిరేజంతకల్‌ పంపా విరూపాక్షేశ్వర రథోత్సవం

గంగావతి,న్యూస్‌టుడే: గంగావతి హిరేజంతకల్‌ పంపా విరూపాక్షేశ్వర రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. భక్తులు వేలాదిగా తరలి వచ్చి స్వామి ఉత్సవాన్ని తిలకించారు. రథానికి అరటిపండ్లు పూలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఆలయ సమితి అన్నసంతర్పణ ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని