logo

అపురూప చిత్రకారుడు బీకేఎస్‌ వర్మ కన్నుమూత

సీనియరు చిత్రకారుడు బుక్కసాగర కృష్ణయ్య శ్రీనివాస వర్మ (76) సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన మూడు నెలలుగా మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Published : 07 Feb 2023 01:48 IST

తాను గీసిన చిత్రంతో బీకేఎస్‌ వర్మ

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : సీనియరు చిత్రకారుడు బుక్కసాగర కృష్ణయ్య శ్రీనివాస వర్మ (76) సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన మూడు నెలలుగా మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్తిబెలె సమీపంలోని కర్నూరుకు చెందిన బీకేఎస్‌ వర్మకు బెంగళూరు వర్సిటీ 2011లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. మైసూరు జగన్మోహన ప్యాలెస్‌లో రాజా రవి వర్మ చిత్రాలను చూసి స్ఫూర్తితో చిత్రాలు వేయడం ప్రారంభించారు. తన పేరు చివర వర్మ చేర్చుకున్నారు. పర్యావరణం, దేవతా చిత్రాలు వేయడంలో ఆయన అందెవేసిన చేయి. వేదికపై గాయకులు ఒక పాటను పాడడం పూర్తి చేసేలోగా ఆయన ఒక చిత్రాన్ని గీసేవారు. వర్మ మృతికి ముఖ్యమంత్రి బొమ్మై, విపక్ష నాయకులు, చిత్రకారులు, సాహితీవేత్తలు, గీతరచయితలు, గాయకులు సంతాపాన్ని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని