logo

నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా సముదాయ భవనాలు

జిల్లాలో సముదాయ భవనాలు సభలు, సమావేశాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే సరస్వతి కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమశాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు అధికారులకు సూచించారు.

Published : 07 Feb 2023 01:48 IST

డా.బాబు జగ్జీవన్‌రాం భవనం, విగ్రహం

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లాలో సముదాయ భవనాలు సభలు, సమావేశాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే సరస్వతి కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమశాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు అధికారులకు సూచించారు. జిల్లా యంత్రాంగం, పంచాయతీ, సమాజ సంక్షేమ శాఖ సంయుక్తంగా స్థానిక నల్లచెరువులోని 4.31 ఎకరాల విశాలప్రదేశంలో ఏర్పాటు చేసిన డా.బాబు జగ్జీవన్‌రాం నూతన భవనం, విగ్రహ ప్రతిష్ఠాపనను మంత్రి ప్రారంభించారు. బాబు జగ్జీవన్‌రాం దేశం గౌరవించే మహావ్యక్తి. హరిత విప్లవం కోసం శ్రమించిన నేత, అంటురాని వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు. ఆయన పేరు మీద నిర్మించిన భవనం, విగ్రహం ప్రతిష్ఠించడం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం బుడకట్టు సముదాయం అభివృద్ధికి రూ.15వేల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. దళిత, గిరిజన వర్గాల సముదాయం సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం రూ.4,500 కోట్ల నుంచి రూ.9500 కోట్లకు పెంచే ఆలోచన ఉందన్నారు. గ్రామీణ శాసనసభ్యుడు బి.నాగేంద్ర, నగర శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో మండలి అధ్యక్షుడు హెచ్‌.హనుమంతప్ప, లోక్‌సభ మాజీ సభ్యురాలు శాంత, వివిధ సంక్షేమ శాఖల అధికారులు సతీశ్‌, సకీనా, సురేష్‌, శాషు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

పింజార్‌ రంజాన్‌సాబ్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న మంత్రి, తదితరులు

పింజార్‌ రంజాన్‌సాబ్‌ విగ్రహం ప్రతిష్ఠ

నగరంలోని స్థానిక డా.రాజ్‌కుమార్‌ రహదారిలోని కేంద్ర గ్రంథాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన కర్ణాటక ఏకీకరణకు పోరాటం చేసిన పహిల్వాన్‌ కప్పగల్‌ పింజార్‌ రంజాన్‌సాబ్‌ విగ్రహాన్ని మంత్రి బి.శ్రీరాములు, శాసనసభ్యులు, అధికారులు ఆవిష్కరించారు.

జగ్జీవన్‌రాం భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి బి.శ్రీరాములు, శాసనసభ్యులు, అధికారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని