logo

Gold Seize: మరుగుదొడ్డిలో బంగారు నిధి

మాల్దీవుల నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో విమానం మరుగుదొడ్డి వాష్‌ బేసిన్‌ నుంచి కస్టమ్స్‌ అధికారులు రూ.1.8 కోట్ల విలువై 3.2 కిలోల బంగారాన్ని మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.

Updated : 18 Oct 2023 08:24 IST

జప్తు చేసుకున్న బంగారం

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : మాల్దీవుల నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో విమానం మరుగుదొడ్డి వాష్‌ బేసిన్‌ నుంచి కస్టమ్స్‌ అధికారులు రూ.1.8 కోట్ల విలువైన 3.2 కిలోల బంగారాన్ని మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారు బిస్కెట్లు తరలిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో విమానంలోని వాష్‌బేసిన్‌ దిగువన ఒక చిన్న సంచిలో బిస్కెట్లు ఉంచి, సరకు దాచారని అధికారులు గుర్తించారు. బెంగళూరు నుంచి మరో ప్రాంతానికి వెళ్లవలసిన ప్రయాణికుడే దాన్ని దాచి ఉంచాడని గుర్తించామని చెప్పారు. బంగారాన్ని జప్తు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు మంగళవారం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని