logo

ఉపాధ్యాయిని అపహరణ

హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు.

Published : 24 Apr 2024 05:58 IST

హుబ్బళ్లి, న్యూస్‌టుడే  : హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. హావేరి జిల్లా ఆలదకట్టికి చెందిన గ్రామ నివాసి సుభాని దొడ్డమని అనే యువకుడు తన కుమార్తెను అపహరించాడని యువతి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కుందగోళ తాలూకా గుడగేరి ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇంకెన్నాళ్లు బతుకుతానో..

హాసన, న్యూస్‌టుడే : తన మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు మద్దతుగా ప్రచారం చేస్తూ మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ కంటతడి పెట్టారు. సకలేశపుర తాలూకా సత్తిగరిళ్లిలో మంగళవారం సాయంత్రం ప్రచారం వేళ.. ‘నేను ఎన్నేళ్లు బతికి ఉంటానో’ అంటూ విలపించారు. రెండేళ్లు బతుకుతానేమో అన్నారు. కావేరి జలవివాదాన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. మండ్యలో ప్రజ్వల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు