logo

ఆర్టీసీ సంక్రాంతి ఆదాయం రూ. 82.28లక్షలు

టీఎస్‌ఆర్టీసీకి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నడిపిన ప్రత్యేక బస్సుల రూపేణ ఖమ్మం రీజియన్‌కు రూ.82.28లక్షల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే రూ.22,22,854 తక్కువగా వచ్చింది.

Published : 19 Jan 2022 05:37 IST

ఖమ్మం మయూరిసెంటర్‌, న్యూస్‌టుడే: టీఎస్‌ఆర్టీసీకి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నడిపిన ప్రత్యేక బస్సుల రూపేణ ఖమ్మం రీజియన్‌కు రూ.82.28లక్షల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే రూ.22,22,854 తక్కువగా వచ్చింది. అయితే గతేడాది ప్రత్యేక సర్వీసులకు 50శాతం అదనపు ఛార్జీని ఆర్టీసీ అధికారులు వసూలు చేశారు. ఈ ఏడాది సంస్థ ఎండీ సజ్జనార్‌ ప్రత్యేక సర్వీసులకు సాధారణ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడంతో ఆదాయంలో కోత పడినట్లైంది. సంక్రాంతి పండుగ కోసం ప్రత్యేక సర్వీసులు ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వైపు, 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఖమ్మం రీజియన్‌ నుంచి హైదరాబాద్‌ వైపు నడిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని