logo

నిర్ణీత గడువులో లే-అవుట్ల ఆమోదం: కలెక్టర్‌

ఇళ్ల స్థలాల లే-అవుట్ల ఆమోదానికి అనుమతులు నిర్ణీత గడువులోగా అందించాలని కలెక్టర్‌ గౌతమ్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం నిర్వహించిన జిల్లా స్థాయి లే-అవుట్‌ ఆమోద కమిటీ సమావేశంలో

Published : 28 Jan 2022 05:14 IST

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమ్‌, మధుసూదన్‌, ఆదర్శ్‌ సురభి తదితరులు

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఇళ్ల స్థలాల లే-అవుట్ల ఆమోదానికి అనుమతులు నిర్ణీత గడువులోగా అందించాలని కలెక్టర్‌ గౌతమ్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం నిర్వహించిన జిల్లా స్థాయి లే-అవుట్‌ ఆమోద కమిటీ సమావేశంలో నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల పరిధిలో అందిన దరఖాస్తులను సమావేశంలో పరిశీలించి లే-అవుట్లు మంజూరుకు అనుమతి తెలిపింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో లే అవుట్ల ఆమోదం కోసం రెవెన్యూ, విద్యుత్తు, నీటిపారుదల, ర.భ.శాఖ, టౌన్‌ ప్లానింగ్‌ తదితర అనుబంధ శాఖలు తమకు అందిన దరఖాస్తులను పరిశీలించి 21 రోజుల్లోగా అనుమతులు మంజూరు చేయాలని, అనంతరం జిల్లా స్థాయి కమిటీలో ఆమోదించటం జరుగుతుందన్నారు. అనుమతుల జారీకి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. లే-అవుట్‌ డెవలపర్స్‌ నిబంధనల మేరకు భూమి అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి నెల జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరుగుతుందని వివరించారు. సమావేశంలో నగర కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, శిక్షణ కలెక్టర్‌ రాహుల్‌, జడ్పీ సీఈవో అప్పారావు, ఆర్డీవోలు రవీంద్రనాథ్‌, సూర్యనారాయణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని