logo

దేవాదాయ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

దేవాదాయ శాఖలో ఉద్యోగులు, అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్‌్ జోన్‌ ఉప కమిషనర్‌ టి.శ్రీకాంత్‌ తెలిపారు.

Published : 19 May 2022 05:47 IST

ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే: దేవాదాయ శాఖలో ఉద్యోగులు, అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్‌్ జోన్‌ ఉప కమిషనర్‌ టి.శ్రీకాంత్‌ తెలిపారు. ఖమ్మం కాల్వొడ్డులోని దేవాదాయ శాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం గ్రీవెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, అర్చకుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి సమస్యను పరిశీలించి సత్వర పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం సహాయ కమిషనర్‌ ఛాంబర్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దేవాదాయ భూములపై ఈవోలు, మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. దేవాలయాల భూముల పరిరక్షణ, వివరాల నమోదు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో శాఖ ఉమ్మడి సహాయ కమిషనర్‌ ఎ.సులోచన, వరంగల్‌ జోన్‌ సూపరింటెండెంట్‌ ఎం.వీరాస్వామి, సూపరింటెండెంట్‌ గౌరిశంకర్‌, ఈవోలు కొత్తూరు జగన్మోహన్‌రావు, వీవీ.నర్సింహారావు, జిల్లా అర్చక సంఘం అధ్యక్షుడు దాములూరి వీరభద్రశర్మ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తాటికొండ వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్లు ఆర్‌.సమత, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని