logo

పవిత్రోత్సవాలకు వైభవంగా పూర్ణాహుతి పూజలు

భద్రాచలం రామాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగారు కవచాల అలంకారంలో దేవదేవుడు సుందరంగా కనిపించడంతో భక్తులు పులకించారు. 7న ఆరంభమైన పవిత్ర ఉత్సవాలకు పూర్ణాహుతి పూజలు వైభవంగా కొనసాగించారు.

Published : 13 Aug 2022 02:46 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం రామాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగారు కవచాల అలంకారంలో దేవదేవుడు సుందరంగా కనిపించడంతో భక్తులు పులకించారు. 7న ఆరంభమైన పవిత్ర ఉత్సవాలకు పూర్ణాహుతి పూజలు వైభవంగా కొనసాగించారు. హయగ్రీవ స్వామి జయంతి పురస్కరించుకుని తిరుమంజనం చేశారు. విద్యార్థులకు పుస్తకాలను, స్వామివారి చిత్రపటాన్ని ఈవో శివాజీ అందించారు. వజ్రోత్సవాలు పురస్కరించుకుని సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమార్చన చేశారు. పవిత్ర ఉత్సవాలతో నిలిచిన నిత్య కల్యాణాలు నేటి నుంచి తిరిగి ప్రారంభమవుతాయని వైదిక పెద్దలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని