logo

న్యాయవాదులకు సమాజాన్ని మార్చే శక్తి: జిల్లా జడ్జి

న్యాయవాద వృత్తిని గొప్పదని, న్యాయవాదులకు సమాజాన్ని మార్చే శక్తి ఉంటుందని జిల్లా జడ్జి డా.టి.శ్రీనివాసరావు అన్నారు.

Published : 27 Nov 2022 05:07 IST

 

తాను రాసిన పుస్తకాన్ని జడ్జి ఎన్‌.సంతోష్‌కుమార్‌కు అందజేస్తున్న జిల్లా న్యాయమూర్తి డా.టి.శ్రీనివాసరావు

ఖానాపురం హవేలి: న్యాయవాద వృత్తిని గొప్పదని, న్యాయవాదులకు సమాజాన్ని మార్చే శక్తి ఉంటుందని జిల్లా జడ్జి డా.టి.శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలు) జిల్లా పదో మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘న్యాయవాద వృత్తిలో నిపుణత’ అనే అంశంపై ప్రసంగించారు. ప్రతి న్యాయవాది జ్ఞానం పెంచుకోవాలన్నారు. సీనియర్‌ న్యాయవాదులు కోర్టులో ఎలా వాదిస్తున్నారో చూసి  జూనియర్లు నేర్చుకోవాలన్నారు. తాను జూనియర్‌ న్యాయవాదిగా ఉన్నప్పటి అనుభవాలు పంచుకున్నారు. న్యాయవాదులు వాడే భాష గురించి, చిన్న చిన్న పొరపాట్లు ఎలా ఇబ్బంది పెడతాయో సోదాహరణంగా వివరించారు. గతంలో వచ్చిన తీర్పులను బాగా అధ్యయనం చేయాలన్నారు. సీనియర్‌ న్యాయవాది, బార్‌కౌన్సిల్‌ సభ్యుడు కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయవాదులు రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేయాలని, నిత్యవిద్యార్థిగా ఉండాలన్నారు. అనంతరం జిల్లా జడ్జిని సత్కరించారు. న్యాయమూర్తి రాసిన పుస్తకాన్ని విడుదల చేశారు. న్యాయమూర్తులు ఎన్‌.సంతోష్‌కుమార్‌, అమరావతి, ఎన్‌.హైమపూజిత, ఎన్‌.శాంతిసోని, పి.మౌనిక, ఆర్‌. శాంతిలత, ఐలు జిల్లా కన్వీనర్‌ సీహెచ్‌ వెంకట్‌, వై. శ్రీనివాసరావు, ఎం. శ్రీనివాసరావు, అంజనీ, మీసాల వెంకటేశ్వర్లు, టి.పాపయ్య, రామలక్ష్మి, వి.లక్ష్మీనారాయణ, జె.పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని