logo

ప్రజలకు చేరువగా పోలీస్‌ వ్యవస్థ: అదనపు డీజీ

ప్రజలకు అత్యంత చేరువగా పోలీస్‌ వ్యవస్థ కొనసాగుతుందని అదనపు డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. వైరా పోలీస్‌ స్టేషన్‌ను ఆయన గురువారం సీపీ విష్ణువారియర్‌తో కలిసి సందర్శించారు.

Updated : 02 Dec 2022 03:30 IST

బ్లూకోట్స్‌ కానిస్టేబుల్‌ బాల్యకు ప్రశంస పత్రం అందిస్తున్న అడిషనల్‌ డీజీ నాగిరెడ్డి, సీపీ విష్ణువారియర్‌

వైరా, న్యూస్‌టుడే: ప్రజలకు అత్యంత చేరువగా పోలీస్‌ వ్యవస్థ కొనసాగుతుందని అదనపు డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. వైరా పోలీస్‌ స్టేషన్‌ను ఆయన గురువారం సీపీ విష్ణువారియర్‌తో కలిసి సందర్శించారు. స్థానికంగా ఉన్న నేర ఘటనలు, రోడ్డు ప్రమాదాలు, ఇతర కేసులు, పురోగతి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నాగిరెడ్డి మాట్లాడుతూ నేర నియంత్రణలో పోలీసు వ్యవస్థ ఎంతో చురుగ్గా పని చేస్తుందని, ప్రజా సహకారంతోనే పూర్తిస్థాయి నేర వ్యవస్థను అదుపులోకి తేగలగమన్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను పరిశీలిస్తూ నియంత్రణ చర్యలను తీసుకోవాలన్నారు. గంజాయి వంటి అక్రమాల పట్టివేతతోపాటు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న బ్లూకోట్స్‌ కానిస్టేబుల్‌ భూక్యా బాల్యను ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రం అందించారు. ఏసీపీ రహమాన్‌, సీఐలు సురేశ్‌, మురళీ, ఎస్సై వీరప్రసాద్‌ పాల్గొన్నారు.

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: అడిషనల్‌ డీజీపీ వై.నాగిరెడ్డి గురువారం సాయంత్రం ఖమ్మం వచ్చారు. పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి వచ్చిన ఆయనకు సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ స్వాగతం పలికారు. అనంతరం సీపీతో కలిసి ఆయన వైరా వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని