logo

పాలకుల నిర్లక్ష్యంపై ప్రజాగర్జన: కూనంనేని

పాలన విస్మరించిన పాలకులకు ప్రజా చైతన్యంతో గుణపాఠం చెబుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు.

Updated : 03 Jun 2023 06:27 IST

పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే: పాలన విస్మరించిన పాలకులకు ప్రజా చైతన్యంతో గుణపాఠం చెబుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. పాల్వంచ పట్టణ పరిధిలోని పిల్లవాగు, పేటచెరువు, శ్రీనివాసకాలనీ, రాహూల్‌గాంధీనగర్‌, ఇందిరాకాలనీ, హమాలీకాలనీ, సీతారామపట్నం, గాంధీనగర్‌, గొల్లగూడెం, పాతపాల్వంచ, పాలకొయ్యతండాల్లో శుక్రవారం కూనంనేని పర్యటించారు. జూన్‌ 11న కొత్తగూడెంలో జరిగే ‘ప్రజాగర్జన’ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీఎంను నేరుగా కలిసి సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోడు పట్టాల సంఖ్యను కుదించారని.. ఈ విషయంలో పునరాలోచన చేయాలన్నారు. పాల్వంచ మున్సిపాల్టీకి స్థానిక ఎన్నికలు నిర్వహించే వరకు పోరాడతామన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ముత్యాల విశ్వనాథం, మండల కార్యదర్శి పూర్ణచందర్‌రావు, పట్టణ సహాయ కార్యదర్శి రాహుల్‌, సుధాకర్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు