logo

మూడు ప్రైవేట్‌ ఆసుపత్రుల సీజ్‌

ఖమ్మం నగరంలో మూడు ప్రైవేట్‌ ఆసుపత్రులను సీజ్‌ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మాలతి తెలిపారు. ఉన్నతాధికారులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఖమ్మంలోని వివిధ ఆసుపత్రుల్లో బుధవారం తనిఖీచేశారు. 

Published : 28 Mar 2024 01:58 IST

తనిఖీ చేస్తున్న వైద్యారోగ్యశాఖ సిబ్బంది

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: ఖమ్మం నగరంలో మూడు ప్రైవేట్‌ ఆసుపత్రులను సీజ్‌ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మాలతి తెలిపారు. ఉన్నతాధికారులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఖమ్మంలోని వివిధ ఆసుపత్రుల్లో బుధవారం తనిఖీచేశారు. ఈ క్రమంలో నిబంధనలు పాటించని, అనుమతులు లేని, వైద్యులు అందుబాటులో ఉండని ఆదర్శ్‌ హాస్పిటల్‌, తులసీ డెంటల్‌, పాజిటివ్‌ హోమియో కేర్‌పై చర్యలు తీసుకున్నారు. అధికారుల తనిఖీల సమయంలో ఆయా ఆసుపత్రుల్లో లోపాలను గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలకు   విరుద్ధంగా ఆసుపత్రులను నిర్వహిస్తున్నట్లు తేల్చారు. ఆదర్శ్‌ హాస్పిటల్‌లో అనైతిక వైద్యం చేస్తున్నట్లు వివరించారు. మిగిలిన రెండింటిని రిజిస్ట్రేషన్‌ చేయించకుండా, వైద్య నిపుణులు లేకుండా చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు. షోకాజ్‌ నోటీసులు జారీ చేసి సమాధానం కోరారు. తనిఖీల్లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సైదులు, డెమో కాశీనాథ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని