యాగంటి పెద్దకోనేరులో ఊడిన మండపం రాయి
బనగానపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని పెద్దకోనేరు మధ్యలోని మండపం రాయి ఊడిపోయిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
యాగంటి (బనగానపల్లి పట్టణం), న్యూస్‌టుడే: బనగానపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని పెద్దకోనేరు మధ్యలోని మండపం రాయి ఊడిపోయిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సంబంధిత పురావస్తు శాఖ అధికారులు వచ్చి పరిశీలించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని భక్తులు వాపోతున్నారు. ఆలయం సమీపంలో మైనింగ్ పనులు జరుగుతుండంతో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని భక్తులు చెబుతున్నారు. కోనేరులో పుణ్యస్నానాలు చేసే భక్తులకు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని పలువురు వాపోతున్నారు. గతంలోనూ పలు స్తంభాలు దెబ్బతినడంతో వాటిని సరిచేశారు. ఏదేమైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. పెద్దకోనేరు మధ్యలోని మండపం రాయి పడిన విషయం నిజమే, పురావస్తుశాఖ అధికారులు పరిశీలించి వెళ్లారని ఆలయాధికారి చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Musharraf: ధోనీ జులపాల జుత్తుకు ముషారఫ్ మెచ్చుకోలు
-
Sports News
Shubman Gill: టిండర్‌లో శుభ్‌మన్ గిల్
-
Crime News
Andhra News: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
-
Crime News
వరంగల్‌లో భాజపా నేత ఆత్మహత్య.. నమ్మినవారు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో
-
India News
స్కూల్‌బస్ డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగు తిప్పిన విద్యార్థిని
-
Sports News
Iftikhar Ahmed: ఇఫ్తికార్.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు