logo

ఎర్రగూడూరులో ఎలుగు సంచారం

పాములపాడు మండలం ఎర్రగూడురు పంట పొలాల్లో ఎలుగుబంటి సంచారంతో గ్రామప్రజలు భయాందోళకు గురవుతున్నారు

Published : 29 Jun 2022 02:35 IST

తోటలో ఏర్పాటు చేసిన బోను

పాములపాడు, న్యూస్‌టుడే: పాములపాడు మండలం ఎర్రగూడురు పంట పొలాల్లో ఎలుగుబంటి సంచారంతో గ్రామప్రజలు భయాందోళకు గురవుతున్నారు. 20 రోజుల క్రితం ఒక గొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడి చేయగా కాపరి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని తరిమేశారు. స్వల్ప గాయలతో అతను బయటపడ్డాడు. గ్రామానికి సమీపంలోని మామిడి, సపోట తోటలో రెండు రోజుల క్రితం కొందరు ఎలుగుబంటిని చూశారు. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురై రాత్రి వేళల్లో కాపలా కాస్తున్నారు. అటవీ అధికారులు ఎలుగుబంటిని బంధించేందుకు బోనును ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని