logo

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వైకాపా విఫలం

ప్రజాసమస్యలు పరిష్కరించడంలో వైకాపా విఫలమైందని తెదేపా నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. మండలంలోని గుంప్రమాన్‌దిన్నెలో శుక్రవారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న

Published : 13 Aug 2022 00:39 IST

బాదుడే బాదుడు కార్యక్రమంలో సమస్యలు తెలుసుకుంటున్న అఖిలప్రియ

శిరివెళ్ల , న్యూస్‌టుడే: ప్రజాసమస్యలు పరిష్కరించడంలో వైకాపా విఫలమైందని తెదేపా నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. మండలంలోని గుంప్రమాన్‌దిన్నెలో శుక్రవారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న తాము ప్రజా సమస్యలను ఎత్తి చూపిస్తుంటే తప్పుడు కేసులు పెట్టి తెదేపా నాయకులు, కార్యకర్తలపై వైకాపా కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు. తెదేపా చేపట్టిన బాదుడే బాదుడు, గడప గడపకు తెదేపా కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంటే వైకాపా నాయకులకు మింగుడు పడటం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో తెదేపాకు ఓటేసి గెలిపిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డిపై నియోజకవర్గంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని, ప్రతి పంచాయతీకి చేతులు చాపి డబ్బులు తీసుకుంటున్నారని, ఈ విషయాన్ని ఎవరిని అడిగినా చెబుతారన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో ఓ కానిస్టేబుల్‌ను నడిరోడ్డుపై హత్య చేస్తే ఇప్పటి వరకు బాధిత కుటుంబాన్ని ఏ ఒక్క వైకాపా నాయకులు పరామర్శించలేదని, తాము వెళ్లొచ్చిన తర్వాతే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర నాయకులు పరామర్శించారన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, కృష్ణతులసి, యామా గురప్ప ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు