logo

తెలుగు గంగ పాలవుతున్న పొలాలు

మండలంలోని చింతలచెరువు, కొలుములపేట గ్రామాల్లో తెలుగు గంగ ప్రధాన కాలువ లీకేజీ నీటితో సుమారు 100 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. 37వ బ్లాక్‌ ఛానల్‌ పనులు చేయకపోవడంతో పంట కాలువలో ప్రవహించాల్సిన నీరంతా పొలాల్లోకి చేరి రైతులకు నష్టం కలిగిస్తోంది.

Published : 17 Aug 2022 02:51 IST

నీటి మునిగిన పొలాలు చూపుతున్న చింతల చెరువు గ్రామ రైతులు

మండలంలోని చింతలచెరువు, కొలుములపేట గ్రామాల్లో తెలుగు గంగ ప్రధాన కాలువ లీకేజీ నీటితో సుమారు 100 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. 37వ బ్లాక్‌ ఛానల్‌ పనులు చేయకపోవడంతో పంట కాలువలో ప్రవహించాల్సిన నీరంతా పొలాల్లోకి చేరి రైతులకు నష్టం కలిగిస్తోంది. చింతల చెరువు, కొలుములపేట గ్రామాల పరిధిలో పంట కాలువలు లైనింగ్‌కు నోచుకోకపోవడంతో తెలుగు గంగ నుంచి వచ్చిన నీరంతా పొలాల్లో ప్రవహించి రూ.లక్షలు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పుడిప్పుడే పంట సాగుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. మరికొందరు రైతులు వరినాట్లు వేసుకునేందుకు జీలుగ సాగు చేశారు. గత రెండేళ్ల నుంచి నీట మునక వల్ల పంటలు దెబ్బతిని భారీగా నష్టపోతున్నామని రైతులు వెంకటేశ్వర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, గోవిందరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని పొలాల వద్ద మంగళవారం వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తెలుగు గంగ ప్రధాన కాలువ లీకేజీ నీరు పొలాల్లో ప్రవహించకుండా చూడాలని కోరుతున్నారు.  

- న్యూస్‌టుడే, చింతలచెరువు (చాగలమర్రి)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని