logo

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. సిద్ధంగా ఉండి గెలిచి రావాలని మంత్రాలయం నియోజకవర్గ బాధ్యుడు తిక్కారెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు.

Published : 29 Sep 2022 03:42 IST

చంద్రబాబుతో జిల్లా నేతల భేటీ

తిక్కారెడ్డితో మాట్లాడుతున్న చంద్రబాబు

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. సిద్ధంగా ఉండి గెలిచి రావాలని మంత్రాలయం నియోజకవర్గ బాధ్యుడు తిక్కారెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలో భాగంగా బుధవారం తిక్కారెడ్డి అమరావతిలోని కార్యాలయంలో చంద్రబాబును కలిసి గంటకుపైగా మాట్లాడారు. నియోజకవర్గంలో గ్రామ, మండలస్థాయి నాయకులను తయారు చేసుకోవాలని అధినేత సూచించారు. వైకాపాలో అసమ్మతి కార్యకర్తలను కలుపుకొని పోవాలన్నారు. బాదుడే-బాదుడు కార్యక్రమంతో ఎక్కువ రోజులు ప్రజల్లోకి వెళ్లాలన్నారు. గత మూడున్నరేళ్లుగా నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు, ఎంపీటీసీ, సర్పంచి ఎన్నికలు, వైకాపా ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిపై చర్చించారు. 184 పార్టీ కార్యక్రమాలు ఆదేశించగా, 124 కార్యక్రమాలకు ప్రత్యక్షంగా హాజరైనట్లు తిక్కారెడ్డి చెప్పారు. అనంతరం కోడుమూరు బాధ్యులు ఆకెపోగు ప్రభాకర్‌ కలిశారు. ఈనాడు - కర్నూలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని