logo

మాజీ సైనికుల ఆందోళన

ఎలాంటి సమాచారం లేకుండా తమ ఇళ్లకు సంబంధించి బేస్‌మట్టం నిర్మాణాలు కూల్చివేశారంటూ మాజీ సైనికులు శనివారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు.

Published : 27 Nov 2022 02:34 IST

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు

కర్నూలు ఎన్టీఆర్‌ సర్కిల్‌ (బి.క్యాంపు), న్యూస్‌టుడే : ఎలాంటి సమాచారం లేకుండా తమ ఇళ్లకు సంబంధించి బేస్‌మట్టం నిర్మాణాలు కూల్చివేశారంటూ మాజీ సైనికులు శనివారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2011లో ఓర్వకల్లులో సర్వే నంబరు 532సిలో 300 మంది మాజీ సైనికులు.. ఒక్కొక్కరికి ఐదు సెంట్ల చొప్పన స్థలాలు ఇచ్చారని తెలిపారు. ఇందులో చాలామంది బేస్‌మట్టం వరకు నిర్మాణాలు చేశారన్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పనులు చేసుకోలేకపోయామని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు కరీంబాషా, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని