logo

చేతికందని నీరు

భక్తులు పెచ్చెర్వు వద్ద ఉన్న చేతిపంపు నీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. గతేడాది పాడైనా ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేదని గూడెం చెంచులు చెబుతున్నారు.

Published : 02 Feb 2023 03:35 IST

పెచ్చెరువులో పనిచేయని చేతిపంపు

క్తులు పెచ్చెర్వు వద్ద ఉన్న చేతిపంపు నీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. గతేడాది పాడైనా ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేదని గూడెం చెంచులు చెబుతున్నారు. నాగలూటి- పెచ్చెర్వు మధ్య నడక దారిలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చేతిపంపులకు మరమ్మతులు చేపట్టలేదని పాదచారులు చెబుతున్నారు.పెచ్చెర్వు గూడెంలో పురాతన బావి నీటిని అన్నదాన శిబిరాలతో పాటు భక్తులకు తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. ఈ బావి మొత్తం చెత్తా చెదారంతో నిండిపోయింది.


కోనీరు తాగలేరు

నాగలూటి క్షేత్రం శ్రీశైల ముఖద్వారం. ఇక్కడ మొదటి మెట్టుకు పూజ చేసి గిరికోనపై నడిచి వెళ్తారు. ఇక్కడి కోనేరులో నీటిని సీసాల్లో తీసుకెళ్తుంటారు. ప్రస్తుతం కోనేరులో ఆకులు, చెత్తాచెదారం పేరుకుపోయింది. నీటిలో పాచిని తొలగించి బ్లీచింగ్‌ చేసే పనులు ఇంకా మొదలు పెట్టలేదు. అన్నదాన శిబిరాలు నిర్వహించే వారే శుభ్రత పనులు చేసుకుంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని