logo

బాల్య వివాహాలు పూర్తి స్థాయిలో నివారించాలి

బాల్య వివాహాల కారణంగా జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు.

Published : 19 Mar 2023 02:20 IST

పాల్గొన్న కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : బాల్య వివాహాల కారణంగా జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. ఆయన శనివారం చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు. బాల్య వివాహాల నివారణపై పిల్లల తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పించాలని, సంబంధిత చట్టాలను వారికి వివరించాలన్నారు. బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా సంబంధిత రెవెన్యూ సిబ్బంది కేసులు చేయించడంతోపాటు తనకు సమాచారం ఇస్తే 48 గంటల్లో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మూడు నెలలకోసారికాక ప్రతి 15 రోజులకొకసారి బాల్య వివాహాలు, ఇతర అంశాలపై చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సమీక్షకు రావాలని కమిటీ ఛైర్‌పర్సన్‌ జుబేదా బేగంకు సూచించారు. జుబేదా బేగం మాట్లాడుతూ అనాథ పిల్లలు, ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు, తప్పిపోయిన కేసులు, బాలకార్మికులు, బాల్య వివాహాల కేసులను కమిటీ పరిష్కరించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నామని.. ఇబ్బందులు ఉన్న వారికి పునరావాసం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ మూడు నెలల కాలంలో పరిష్కారం కాని కేసులు 7 వరకు ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్‌ ఇన్‌ఛార్జి పీడీ ఉమామహేశ్వరి, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు మురళీకృష్ణ, వెంకట రామయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు