logo

సిరి ధాన్యాలతో ఆరోగ్య సంరక్షణ

అధిక పోషక విలువల కలిగిన సిరి ధాన్యాలతో తయారుచేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌ పేర్కొన్నారు.

Published : 21 Mar 2023 02:26 IST

సిరుధాన్యాలతో తయారుచేసిన ఆహార పదార్థాల రుచి చూస్తున్న కలెక్టర్‌

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : అధిక పోషక విలువల కలిగిన సిరి ధాన్యాలతో తయారుచేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌ పేర్కొన్నారు. స్థానిక సెంటినరి హాల్‌ ప్రాంగణంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం, ఐసీడీఎస్‌ తదితర శాఖల సహకారంతో సోమవారం ఏర్పాటు చేసిన సిరిధాన్యాల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అతి తక్కువ వర్షపాతంతో అధిక దిగుబడి వచ్చే సిరి ధాన్యాల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలో కూడా స్టాల్స్‌ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్‌ పరిశీలించారు. మహిళా సంఘాలు తయారు చేసిన సిరి ధాన్యాల ఆహార పదార్థాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఆర్వో పుల్లయ్య, డీఆర్డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జయదేవ్‌, జడ్పీ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, ఉద్యానవన శాఖాధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని