logo

తెదేపాలోనే బీసీలకు పెద్దపీట

రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు చట్టసభలో సీట్లు కేటాయించి అత్యున్నత స్థానం కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు.

Published : 28 Mar 2024 03:23 IST

31న ఎమ్మిగనూరులో చంద్రబాబు ప్రజాగళం
తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు నాగరాజు, బీవీ

వెంకటాపురం వద్ద హెలీప్యాడ్‌ స్థలాన్ని పరిశీలిస్తున్న తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు నాగరాజు, బీవీ

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు చట్టసభలో సీట్లు కేటాయించి అత్యున్నత స్థానం కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ నెల 31న తెదేపా అధినేత చంద్రబాబు ఎమ్మిగనూరులో ప్రజాగళం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డితో కలిసి ఎమ్మిగనూరులో పర్యటించి రూట్‌ మ్యాప్‌ను పరిశీలించి మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం బీసీలను మోసం చేసిందన్నారు. కర్నూలు ఎంపీ టికెట్‌ను బీసీ కురువ సామాజిక వర్గానికి కేటాయించి సముచిత స్థానం కల్పించారన్నారు. అనంతరం ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలుకు హైకోర్టు వస్తుందని చెప్పారు, ఇప్పటి వరకు రాలేదన్నారు. చేనేత కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటే ముఖ్యమంత్రి జగన్‌, చేనేత అని చెప్పుకొనే ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి స్పందించలేదన్నారు. చంద్రబాబు హాజరవుతున్న ప్రజాగళం కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుందరరాజు, రాందాస్‌గౌడు, రంగన్న, దాదాసాహెబ్‌, తురేగల్‌ నజీర్‌, మెకానిక్‌ నజీర్‌, వెంకట్‌, అంబేడ్కర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని