logo

అపోహ వద్దు.. ఆల్కహాల్‌తో చేటే!

ఎండలు మండిపోతుండటంతో చాలా మంది బీర్లు తెగ   తాగేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని ప్రాంతాల్లో అమాంతంగా వాటి అమ్మకాలు పెరగడమే ఇందుకు నిదర్శనం.

Updated : 26 May 2023 03:37 IST

ఎండలు మండిపోతుండటంతో చాలా మంది బీర్లు తెగ   తాగేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని ప్రాంతాల్లో అమాంతంగా వాటి అమ్మకాలు పెరగడమే ఇందుకు నిదర్శనం. బీర్లు తాగితే ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందొచ్చనేది అపోహ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. వేసవిలో ఏ రకమైన ఆల్కహాల్‌ అయినా విపరీతంగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేయడంతో పాటు తొందరగా డీహైడ్రేషన్‌ బారిన పడే ముప్పు ఉందని చెబుతున్నారు. వీటికి బదులుగా పండ్లు, పండ్ల రసాలు తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

* బీరు, విస్కీ, బ్రాందీ, వైన్‌.. ఇలా అన్ని రకాల ఆల్కహాళ్లలో డయూరిట్‌ ప్రభావం ఉంటుంది. ఈ పదార్థాలు శరీరంలోకి వెళ్లిన తర్వాత దానిని నిర్వీర్యం చేసి యూరిన్‌ రూపంలో మూత్రపిండాలు బయటకు పంపుతాయి. ఫలితంగా శరీరంలోని నీళ్లతో పాటు సోడియం, పొటాషియం బయటకు పోయి త్వరగా డీహైడ్రేషన్‌ బారిన పడతారు.

* చాలా మందిలో బీరు, వైన్‌ తాగితే ఏమీ కాదనే భ్రమలో ఉంటారు. ఆల్కహాల్‌ ఏదైనా ప్రమాదమేనన్న సంగతి గుర్తుంచుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

* ఎండాకాలంలో బీర్ల జోలికి పోకపోవడమే మంచిది. దాహం వేస్తే స్వచ్ఛమైన మంచినీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్‌ లేదా ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం, సీజనల్‌ పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని