logo

ఎంచక్కని బడులు.. గురువులే కొరత

ధన్వాడలోని బాలుర ఉన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరం 967 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పతి 1:40 ఉండాలి దీని ప్రకారం ఆలోచిస్తే 25 మంది

Published : 03 Jun 2023 04:34 IST

ప్రభుత్వ పాఠశాలల్లో వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత

కొండాపూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

న్యూస్‌టుడే, ధన్వాడ : ధన్వాడలోని బాలుర ఉన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరం 967 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పతి 1:40 ఉండాలి దీని ప్రకారం ఆలోచిస్తే 25 మంది ఉపాధ్యాయులు అవసరం. జీహెచ్‌ఎంతో కలుపుకొని 16 మంది మాత్రమే ఉన్నారు. అయిదు పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

* మక్తల్‌ బాలుర ఉన్నత పాఠశాలలో గత ఏడాది 680 విద్యార్థులు ఉన్నారు. మొత్తం 20 మంది ఉపాధ్యాయ పోస్టులు ఉండగా 16 మంది మాత్రమే ఉన్నారు.

* జిల్లాలో పలు చోట్ల ఏకోపాధ్యాయ ఒక్కరే తెలుగు, ఆంగ్లం బోధించలేక సతమతమవుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మన ఊరు-మన బడి కార్యక్రమంలో కార్పోరేట్ స్థాయి వసతులు కల్పిస్తున్నారు.  ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులు నేలపై కూర్చోకుండా బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రీన్‌ బోర్డులతో పాటు డిజిటల్‌ పాఠాల బోధనకు వసతులు సమకూరుతున్నాయి. ఉచితంగా పాఠ్య, రాత పుస్తకాలు, ఆకర్షణీయమైన ఏకరూప దుస్తులు అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఇవన్ని బాగానే ఉన్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను మాత్రం భర్తీ చేయడం లేదు. కనీసం వాలంటీర్ల నియామకాలపై దృష్టి పెట్టడంలేదు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం అంటే విద్యార్థుల సంఖ్య పెంచుకోవడం కాదని,  ఉపాధ్యాయులు లేకుంటే ప్రయోజనం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వానికి నివేదించాం

ఖాళీలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించాం.  ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న విషయాన్ని విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లి కొత్త పోస్టులు మంజూరు చేయాలని కోరాం. ఇవన్నీ  విద్యాశాఖ పరిశీలనలో ఉన్నాయి.

విద్యాసాగర్‌, ఏఎంవో, నారాయణపేట


పేట జిల్లాలో పరిస్థితి..

మొత్తం పోస్టులు   2,490

ప్రస్తుతం ఉన్నది   2,070

ఖాళీల సంఖ్య     420


ప్రభుత్వ, స్థానిక సంస్థల బడుల్లో ఖాళీలు  (ఈ ఏడాది గణాంకాలు వెల్లడి కాలేదు. గత ఏడాది విద్యాశాఖ లెక్కల ప్రకారం)

జీహెచ్‌ఎం గ్రేడ్‌ -2 పోస్టులు : 31

గణితం స్కూల్‌ అసిస్టెంట్‌ : 21

ఎస్‌ఏ ఫిజికల్‌ సైన్స్‌ : 10

ఎస్‌ఏ బయాలజీ : 31

ఎస్‌ఏ సాంఘిక శాస్త్రం : 35

ఎస్‌ఏ ఇంగ్లీష్‌ : 20

ఎస్‌జీటీ పోస్టులు : 119

తెలుగు మాధ్యమంలోఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం : 64

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని