logo

విండో సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ప్రాథమిక వ్యవసాయ సహకార  పరపతి సంఘం ద్వారా అందిస్తున్న సేవలను  రైతులు సద్వినియోగం చేసుకోవాలని  డీసీసీబీ  డైరెక్టర్, విండో ఛైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.

Published : 27 Mar 2024 12:40 IST

పాన్ గల్ : ప్రాథమిక వ్యవసాయ సహకార  పరపతి సంఘం ద్వారా అందిస్తున్న సేవలను  రైతులు సద్వినియోగం చేసుకోవాలని  డీసీసీబీ  డైరెక్టర్, విండో ఛైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. బుధవారం పాన్‌గల్  పీఏసీఎస్  మహాజన  సర్వ సభ సమావేశం సీఈవో భాస్కర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు. రైతులకు సకాలంలో  ఎరువులు, విత్తనాలు అందించడానికి సంఘం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ సహకారంతో రైతుల అభ్యున్నతికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారిస్తామన్నారు. సమావేశంలో వైస్ ఛైర్మన్ కుర్వ బాలయ్య, జడ్పీ కోఆప్షన్ మునిరొద్దీన్, మండల కోఆప్షన్ అలీమ్, డైరెక్టర్ లు ప్రసాద్ గౌడ్, జైపాల్ రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని