logo

ఎన్నికల నిర్వహణలో అధికారులది కీలకపాత్ర

ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్‌ అధికారులదే కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు.

Published : 05 May 2024 02:20 IST

శిక్షణనుద్దేశించి మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి తేజస్‌నందలాల్‌ పవార్‌

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే : ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్‌ అధికారులదే కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు. వనపర్తి నియోజకవర్గానికి కేటాయించిన పీవో, సహాయ పీవోలకు ఎన్నికల నిర్వహణ, ఈవీఎంలపై శనివారం వనపర్తిలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలింగ్‌ రోజున పాటించాల్సిన బాధ్యతలు, చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు విధుల పట్ల కఠినంగా ఉండాలన్నారు. ఇబ్బందులు వస్తే సెక్టోరియల్‌ అధికారులతో సహాయం పొందాలన్నారు. శిక్షణలో అదనపు కలెక్టర్‌ సంచిత్‌గంగ్వార్‌, మాస్టర్‌ ట్రైనర్లు పాల్గొన్నారు.

అభ్యర్థుల ఖర్చుపై ప్రత్యేక దృష్టి..

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే: పోటీలో ఉన్న అభ్యర్థుల ఖర్చు, ఎన్నికల వ్యయ లెక్కింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ ఎన్నికల వ్యయ పరిశీలకుడు సౌరభ్‌ అన్నారు. శనివారం వనపర్తికి వచ్చిన ఆయన జిల్లా అదనపు కల్టెకలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌తో పాటు అకౌంట్ బృందంతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ ద్వారా, సామాజిక మాధ్యమంలో వచ్చే ప్రకటనలను ఎలా పర్యవేక్షిస్తున్నారు.. ఇప్పటి వరకు ఎన్ని ప్రకటనలు గుర్తించారని అదనపు కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. సమీకృత కంట్రోల్‌ రూంను పరిశీలించారు. ఎఫ్‌.ఎస్‌.టి., ఎస్‌.ఎస్‌.టి. బృందాల పనితీరునడిగి తెలుసుకున్నారు. సీ విజిల్‌, టోల్‌ఫ్రీ నంబరు 1950కు వచ్చిన ఫిర్యాదులు, పరిష్కరించిన సమయాన్ని ఆన్‌లైన్‌లో పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలనియమావళిని కచ్చితంగా అమలుచేయాలన్నారు. సమావేశంలో  కార్యాలయ ఎఒ భానుప్రకాష్‌, డీపీˆఆర్వో సీˆతారాంనాయక్‌, అకౌంటెంట్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని