logo

లక్ష్యం రూ.3,347.80 కోట్లు

జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన (2022-23) వార్షిక రుణ ప్రణాళిక ఎట్టకేలకు ఖరారైంది. గతేడాది ప్రగతి నివేదికతో పోలుస్తూ వచ్చే ఏడాది వృద్ధి శాతాన్ని అంచనా వేస్తూ జిల్లా పాలనా యంత్రాంగం శుక్రవారం కరదీపికను విడుదల చేసింది.

Published : 25 Jun 2022 01:25 IST

వార్షిక రుణ ప్రణాళిక ఖరారు..

న్యూస్‌టుడే, మెదక్‌

రుణ ప్రణాళిక విడుదల చేస్తున్న ప్రతిమాసింగ్‌, వేణుగోపాల్‌రావు, శ్రీనివాస్‌ తదితరులు

జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన (2022-23) వార్షిక రుణ ప్రణాళిక ఎట్టకేలకు ఖరారైంది. గతేడాది ప్రగతి నివేదికతో పోలుస్తూ వచ్చే ఏడాది వృద్ధి శాతాన్ని అంచనా వేస్తూ జిల్లా పాలనా యంత్రాంగం శుక్రవారం కరదీపికను విడుదల చేసింది. ఏయే రంగాలకు ఎన్ని నిధులివ్వాలనే అంశంపై జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి నిర్ణయం తీసుకుంది. ఈ సారి లక్ష్యం రూ.3,347.80 కోట్లుగా నిర్దేశించారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో ఈ సారి వ్యవసాయ రంగానికే పెద్దపీట వేశారు. అత్యంత ప్రాధాన్య రంగంగా రైతుల పంట రుణాలకే 46 శాతం కేటాయించడం గమనార్హం. మరో 54 శాతం వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌ వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని సూచించారు. కార్యక్రమంలో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ వేణుగోపాల్‌రావు, డీఆర్డీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని