దత్తగిరి.. ఆధ్యాత్మిక నిలయం
ఆధ్యాత్మిక ఆశ్రమం బర్దీపూర్ దత్తగిరి మహారాజ్ శతజయంతి వేడుకలో కేంద్ర రసాయనాల ఎరువుల శాఖ మంత్రి భగవత్‌కుబా గురువారం పాల్గొన్నారు.
జ్యోతిర్లింగాలకు పూజ చేస్తున్న కేంద్రమంత్రి భగవత్‌కుబా
ఝరాసంగం: ఆధ్యాత్మిక ఆశ్రమం బర్దీపూర్ దత్తగిరి మహారాజ్ శతజయంతి వేడుకలో కేంద్ర రసాయనాల ఎరువుల శాఖ మంత్రి భగవత్‌కుబా గురువారం పాల్గొన్నారు. వైదిక విద్యార్థులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసి పంచవృక్షాలను దర్శించుకున్నారు. ఆశ్రమ ఆవరణలో కొనసాగుతున్న అతిరుద్ర, రుద్ర సహిత దత్తయజ్ఞంలో పాల్గొన్నారు. ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి మహారాజ్, ఉత్తరాధికారి సిద్దేశ్వర్‌స్వామి, మాతృశ్రీ అనుసూయమాత మంత్రిని సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దత్తగిరి ఆధ్యాత్మిక నిలయమని, భక్తులను భక్తిమార్గంలో పయనించేందుకు పీఠాధిపతి కృషి చేస్తున్నార న్నారు. సర్పంచి శివలక్ష్మీ, భాజపా నాయకులు జగన్, శ్రీనివాస్‌గౌడ్, జనార్దన్‌రెడ్డి, మల్లికార్జున్‌పాటిల్, అడివన్న, సుధీర్‌కుమార్, సుధీర్‌బండారీ, విశ్వనాథ్ తదితరులున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Biden: జిన్‌పింగ్‌కు పరిమితులు తెలుసు..: బైడెన్
-
World News
Earthquake: చేజారిన ఆ 72 గంటలు.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరగనున్న మృతులు..!
-
Movies News
Prakash Raj: ‘కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్‌రాజ్ తీవ్ర వ్యాఖ్యలు
-
World News
Earthquake: అంతులేని విషాదం.. భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..!
-
Crime News
Kakinada: కాకినాడ జిల్లాలో విషాదం.. ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురి మృతి
-
Movies News
Remix Songs: ఆ‘పాత’ మధుర గీతాలు కొత్తగా.. అప్పుడలా.. ఇప్పుడిలా!