logo

పురపాలిక ఎన్నికలు జరపకుండా వేడుకలా?

జహీరాబాద్‌ పురపాలికకు ఎన్నికలు జరపకుండా పట్టణంలో దశాబ్ది ఉత్సవాలేంటని మంత్రి కేటీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు లేఖ రాశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్‌ జలాలుద్దీన్‌తో కలిసి లేఖను విడుదల చేశారు.

Published : 02 Jun 2023 01:55 IST

జహీరాబాద్‌ అభివృద్ధిపై కేటీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ

న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌: జహీరాబాద్‌ పురపాలికకు ఎన్నికలు జరపకుండా పట్టణంలో దశాబ్ది ఉత్సవాలేంటని మంత్రి కేటీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు లేఖ రాశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్‌ జలాలుద్దీన్‌తో కలిసి లేఖను విడుదల చేశారు. లక్ష పైచిలుకు జనాభా కలిగిన పట్టణంలో నాలుగేళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదన్నారు. పురపాలికలో విలీనమైన అల్లీపూర్‌, పస్తాపూర్‌, రంజోల్‌, చిన్నహైదరాబాద్‌, హోతి(కె) గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. హోతి(కె) విలీనంపై గ్రామస్థులు హైకోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించి ఆర్నెల్లు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. జహీరాబాద్‌ పురపాలికకు త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేలా కేటీఆర్‌ చొరవ చూపాలని, అప్పుడే దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు అర్థం ఉంటుందన్నారు.
లేఖ విడుదల చేస్తున్న కూనంనేని..    చిత్రంలో సయ్యద్‌ జలాలుద్దీన్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని