logo

ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి

నర్సాపూర్‌లోని హైదరాబాద్‌ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్‌ కుమార్‌ రాజ్‌వాన్ష్‌ గురువారం తనిఖీ చేశారు.

Published : 19 Apr 2024 02:01 IST

రికార్డులను పరిశీలిస్తున్న  ఎన్నికల వ్యయ పరిశీలకులు సునీల్‌ కుమార్‌

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: నర్సాపూర్‌లోని హైదరాబాద్‌ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్‌ కుమార్‌ రాజ్‌వాన్ష్‌ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రతి వాహనాన్ని తప్పకుండా తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద 24 గంటలు సీసీ కెమెరాలు పని చేసేలా చూడాలన్నారు. సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెక్‌పోస్టు రికార్డులను పరిశీలించారు. నర్సాపూర్‌ ఆర్డీవో జగదీశ్వర్‌ రెడ్డి, తహసీల్దార్లు కమలాద్రి చారి, శ్రీనివాస చారి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

  • నర్సాపూర్‌లో హైదరాబాద్‌ మార్గంలోని చెక్‌పోస్ట్‌ వద్ద మెదక్‌ ఎమ్మెల్యే రోహిత్‌రావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఎమ్మెల్యే పోలీసులకు సహకరించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని