logo

బలహీనవర్గాల అభ్యున్నతే కేసీఆర్‌ లక్ష్యం: దూదిమెట్ల

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్‌ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ అన్నారు. మండలంలోని రెడ్లరేపాక గ్రామంలో గొర్రెల మందల వద్ద సోమవారం రాత్రి

Published : 26 Jan 2022 04:17 IST

వలిగొండ: రెడ్లరేపాకలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ

ఛైర్మన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌, జిల్లా యాదవ సంఘ అధ్యక్షుడు అయోధ్య యాదవ్‌, తదితరులు

వలిగొండ, న్యూస్‌టుడే: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్‌ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ అన్నారు. మండలంలోని రెడ్లరేపాక గ్రామంలో గొర్రెల మందల వద్ద సోమవారం రాత్రి ఆయన ‘పల్లె నిద్ర’ చేసి గొల్ల, కురుమల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఆ గ్రామంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కురుమల అభివృద్ధికి రూ. 12వేల కోట్ల నిధులు కేటాయించి పెద్దపీట వేశారన్నారు. మొదటి విడతగా రూ.5 వేల కోట్ల నిధులతో లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు కేసీఆర్‌ అని కొనియాడారు. రెండో విడత గొర్రెలను త్వరలో పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మూగజీవులకు వచ్చే జబ్బులపై పెంపకందారులకు అవగాహన కల్పించాలని పశు వైద్యాధికారులకు సూచించారు. అనంతరం గొల్ల, కురుమ సంఘ నాయకులు పూలమాల, శాలువాతో అయన్ను సత్కరించారు. కార్యక్రమంలో యాదవ సంఘ జిల్లా అధ్యక్షుడు అయోధ్యయాదవ్‌, ఎంపీటీసీ సభ్యుడు నోముల మల్లేశం, దేశబోయిన సూర్యనారాయణ, దేశబోయిన బాలస్వామి, డేగల పాండరి, ఎమ్మె లింగస్వామి, యాద మల్లయ్య, దేశబోయిన రాములు, పెద్ద గొల్ల మల్లయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని