logo

ఆడ శిశువు మృతి

వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో పుట్టిన ఆడశిశువు మృతిచెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. బాధితుల వివరాల ప్రకారం.. కొండభీమనపల్లికి చెందిన మెండె మొగులయ్య.. గర్భిణీ అయిన తన భార్య ధనమ్మను ఈ నెల 13న దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు.

Published : 18 Aug 2022 05:09 IST

వైద్య సిబ్బంది నిర్లక్ష్యమంటూ బంధువుల ఆందోళన

రహదారిపై శిశువు మృతదేహంతో ఆందోళన నిర్వహిస్తున్న  బంధువులు

దేవరకొండ, న్యూస్‌టుడే: వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో పుట్టిన ఆడశిశువు మృతిచెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. బాధితుల వివరాల ప్రకారం.. కొండభీమనపల్లికి చెందిన మెండె మొగులయ్య.. గర్భిణీ అయిన తన భార్య ధనమ్మను ఈ నెల 13న దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. నొప్పులు రావడంతో వైద్యురాలు శశికళ సాధారణ ప్రసవం నిర్వహించేందుకు నిశ్చయించారు. సాధారణ కాన్పుతో ధనమ్మ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. శిశువు స్వల్ప అస్వస్థతకు గురికావడంతో వైద్య సిబ్బంది నీలోఫర్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం శిశువు మృతిచెందింది. శిశువు మృతికి ప్రసవ సమయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ దేవరకొండ పట్టణంలోని కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై శిశువు బంధువులు ఆôదోళన నిర్వహించారు. సీఐ శ్రీనివాస్‌, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ రాములునాయక్‌ అక్కడికి చేరుకోగా.. ప్రసవ సమయంలో నర్సులు, ఆయాల నిర్లక్ష్యంతో శిశువుకు బలమైన గాయాలయ్యాయని, అందుకే శిశువు మృతిచెందిందని బంధువులు సీఐ శ్రీనివాస్‌కు ఫిర్యాదు అందజేశారు. విచారణ జరుపుతామని డాక్టర్‌ రాములునాయక్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని