logo

న్యాయ సేవలు పొందలేక ఎవరూ నష్టపోవొద్దు

న్యాయసేవలు పొందలేక ఏ ఒక్కరూ అన్యాయానికి గురి కాకూడదనే దృక్పథంతో న్యాయ సహాయ రక్షణ న్యాయవాద వ్యవస్థను ఉన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసినట్లు  జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.గౌతంప్రసాద్‌ అన్నారు.

Published : 07 Feb 2023 06:22 IST

ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌతంప్రసాద్‌, ఇతర న్యాయవాదులు

సూర్యాపేట న్యాయవిభాగం, న్యూస్‌టుడే: న్యాయసేవలు పొందలేక ఏ ఒక్కరూ అన్యాయానికి గురి కాకూడదనే దృక్పథంతో న్యాయ సహాయ రక్షణ న్యాయవాద వ్యవస్థను ఉన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసినట్లు  జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.గౌతంప్రసాద్‌ అన్నారు. న్యాయవాదులను నియమించుకొనే స్థోమత లేని నిందితుల తరఫున కేసుల విచారణకు సహకరించేందుకు కొత్తగా న్యాయ సహాయ రక్షణ న్యాయవాద వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో  ఈ వ్యవస్థను సోమవారం హైకోర్టు నుంచి వర్చువల్‌ విధానంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ప్రారంభించారు. ఇందులో భాగంగా సూర్యాపేటలో ఈ వ్యవస్థను జిల్లా ప్రధాన న్యాయమూర్తి లాంఛనంగా ప్రారంభించారు. అదనపు జిల్లా న్యాయమూర్తి జి.ప్రేమలత, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సివిల్‌ జడ్జి పి.శ్రీవాణి, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు కె.సురేశ్‌, జె.ప్రశాంతి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు గోండ్రాల అశోక్‌, ఎస్‌.సోమేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని