బస్సు ఢీకొని 8 ఆవులు మృతి
పశుగ్రాసం కోసం మిర్యాలగూడ వైపు వెళ్తున్న గోవుల మందను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 ఆవులు మృతిచెందాయి.
బాధితులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
మాడ్గులపల్లి(వేములపల్లి),న్యూస్‌టుడే: పశుగ్రాసం కోసం మిర్యాలగూడ వైపు వెళ్తున్న గోవుల మందను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 ఆవులు మృతిచెందాయి. ఈ ఘటన మంగళవారం బుగ్గబావిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరేడుగొమ్మ మండలం కాచరాజుపల్లి గ్రామానికి చెందిన పెద్దగొల్ల పుల్లయ్య, రమావత్ రాములు మరికొంత మందితో కలిసి సుమారు రెండువేల ఆవుల మందను మేతకోసం మిర్యాలగూడ కెనాల్ ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం గ్రామానికి చేరుకోగానే...గోవులు ఒక్కసారిగా బెదిరాయి. అలా బెదరడంతో మందలోని కొన్ని చెల్లాచెదురుగా అయ్యాయి. ఈ క్రమంలోనే కొన్ని ఆవులు రహదారి అవతలి వైపుకు వెళ్లాయి. అలా వెళ్తుండగా చెన్నై నుంచి హైదరాబాదు వెళ్తున్న ప్రైవేటు బస్సు గోవులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 ఆవులు అక్కడిక్కడే మృతిచెందాయి.బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీను కేసు నమోదు చేశారు.సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటగిరి పరిశీలించారు. ఈ విషయం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు దృష్టికి రావటంతో మృతి చెందిన ఆవుల్ని పరిశీలించారు. ప్రైవేటు బస్సు ఏజెన్సీతో మాట్లాడి బాధితులకు త్వరితగతిన నష్టపరిహారం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్, పశువైద్యాధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: చేతులేనా.. చేతల్లోనూనా!: గహ్లోత్, పైలట్ మధ్య సయోధ్యపై సందేహాలు
-
Crime News
దారుణం.. భార్యపై అనుమానంతో శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు!
-
Ts-top-news News
పీఎం స్వనిధి ఉత్సవాలకు వరంగల్ చాయ్‌వాలా.. సిరిసిల్ల పండ్ల వ్యాపారి
-
Ap-top-news News
Chandrababu-AP CID: చంద్రబాబు నివాసం జప్తునకు అనుమతి కోరిన ఏపీ సీఐడీ
-
Ts-top-news News
Dharani portal: ధరణిలో ఊరినే మాయం చేశారు