logo

పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఏప్రిల్‌ 3 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు

Published : 30 Mar 2023 04:06 IST

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: ఏప్రిల్‌ 3 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. కాంపోజిట్‌ కోర్సు సంబంధించిన పేపరు, సైన్స్‌ పేపర్లు ఉదయం 9:30-12:50 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధింపు, జిరాక్స్‌ కేంద్రాల మూసివేత ఇతర అంశాలపై శ్రద్ధ వహించాలన్నారు. కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, డీఈవో బిక్షపతి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని