logo

యాదాద్రీశుడికి శతఘటాభిషేకం

పంచనారసింహుల దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు.

Updated : 29 Mar 2024 06:20 IST

స్వాతి వేడుకలో ప్రధాన కలశంతో ప్రదక్షిణ

యాదగిరిగుట్ట అర్బన్‌, న్యూస్‌టుడే: పంచనారసింహుల దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాతం చేపట్టి, అష్టోత్తరం శత కలశాలను పూజించి పంచామృతం జలాలతో నింపారు. వేద, మంత్ర పఠనాల మధ్య గర్భాలయంలోని స్వయంభువులను 108 కలశాలలోని పంచామృతం, పూజా జలంతో అభిషేకం నిర్వహించారు. తులసీ దళాలతో అర్చన చేశారు. స్థానికులు, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేకువజామున గిరి ప్రదక్షిణ చేశారు. దైవదర్శనం చేసుకున్నారు. సాయంత్రం వేళ స్వాతి సేవోత్సవం చేపట్టారు. అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్టలోని ఆలయంలోనూ స్వాతి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ప్రధానాలయంలో నిత్యారాధనలు యథావిధిగా కొనసాగించారు. ఆలయ మహాముఖ మండపంలో అష్టోత్తరం, నిత్య కల్యాణం నిర్వహించారు. సాయంత్రం అలంకార జోడు సేవ, దర్బార్‌ సేవ పర్వాలను చేపట్టారు. రాత్రివేళ మూల వరులకు ఆరాధన, సహస్రనామార్చన జరిపారు. వివిధ విభాగాల ద్వారా స్వామివారికి రూ.22,67,500 నిత్యాదాయం సమకూరిందని ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని